ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు ?: సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలువుతున్న వ్యవస్థ అనేది ఉందంటే అది గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ.
ఈ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ 50 కుటుంబాలకు అందవలసిన ప్రభుత్వ పథకాలు ఇతర అవసరాలు అన్నిటిని కూడా ఈ వ్యవస్థ దగ్గరుండి నడిపిస్తూ చూసుకుంటూ ఉంటుంది.
అలాంటి వాలంటీర్ వ్యవస్థ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ వ్యవస్థ రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ అప్పటి మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ గారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా “గ్రామ వార్డు వాలంటీర్లు వైసిపి కార్యకర్తలు” అంటూ చేసిన కామెంట్స్ కూడా ఈ పిటిషన్ కు జోడించినట్లు ఆ సంస్థ పేర్కొంది.
నవంబర్ 28వ తేదీన సుప్రీంకోర్టులో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ పై రద్దు అనే అంశంపై విచారణ అనేది చేపట్టనుంది సుప్రీంకోర్టు న్యాయస్థానం.
దీంతో రాబోయే ఎన్నికల్లో గ్రామ వార్డు వాలంటీర్ల సంస్థ ప్రభావితం ఓటర్లను ఎక్కువగా చేసే అవకాశం ఉందంటూ ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ పిటిషన్ను విచారణకు నిమిత్తం తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఈ పిటిషన్ విచారణ జరగనుంది.