ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డిసెంబర్ నెలలో ముఖ్యంగా అందులో
1. Dec -1 to 5 :వైయస్సార్ పెన్షన్ కానుక:
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2,750 పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ నెలలో 1 తేదీ నుంచి 5 తేదీ అమలులో ఉంటుంది.
2.Dec 7: జగనన్న విద్యా దీవెన పథకం :
దీని ద్వారా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలో కాలేజీ ఫీజును జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెలలో ఒక కొత్త నియమ నిబంధన తీసుకొచ్చింది ఆ నిబంధనలో విద్యార్థి తల్లి విద్యార్థి ఇద్దరూ కలిసి కూడా ఒక జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసి ఆ జాయింట్ అకౌంట్ ను సచివాలయంలో అందించవలసి ఉంటుంది ఆ జాయింట్ అకౌంట్ లోనే ఈ జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలు వాటికొచ్చే డబ్బులు ఆ ఎకౌంట్లోనే జమవుతాయి ఈనెల ఏడో తేదీన జగనన్న విద్యా దీవెనకు సంబంధించి నాలుగో విడతగా ఈ డబ్బులనేవి జమవుతున్నాయి ఈ జాయింట్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే విద్యా దీవెన పథకంలో డబ్బులు అనేవి వస్తాయి మరియు విద్యార్థి తప్పనిసరిగా గ్రామ వార్డు వాలంటీర్ దగ్గర ఈ కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి.
Dec 16 : వైయస్సార్ సున్నా వడ్డీ పథకం.
ఈ పథకంలో భాగంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉండే ప్రతి ఒక్క మహిళకి ఆ గ్రూపులో తీసుకున్న రుణాలకు వచ్చే వడ్డీ మొత్తాన్ని డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం ఉన్న మహిళల ఖాతాలోకి వాళ్ళ సొంత ఖాతాలోకి ఈ డబ్బులనేవి వడ్డీ రూపంలో జమవుతాయి ఈ వడ్డీ మొత్తాన్ని వాళ్ళ యొక్క సొంత ఖర్చులకు వినియోగించుకోవచ్చు ఎటువంటి తారతమ్యాలు లేకుండా బ్యాంకు వారు ఈ డబ్బును వాళ్ళ అకౌంట్లోనే జమ చేయాలంటూ బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉన్నాయి.
Dec 27 : Biannual Sanction 2023 :
బై యాన్యువల్ సాంక్షన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం జూలై నెల నుంచి నవంబర్ 31వ తేదీ వరకు లబ్ధిదారులందరూ కూడా ఏ పథకంలోనైనా అర్హత కలిగి ఉండి ఆ పథకానికి సంబంధించి డబ్బులు మీకు జమ కాకపోయినట్లయితే గ్రామ వార్డు సచివాలయం ద్వారా మీరు గ్రీవెన్స్ అనేది నమోదు చేసుకొని ఉండి సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ పూర్తయిన వరకు అటువంటి లబ్ధిదారులు అందరు కూడా డిసెంబర్ 27వ తేదీన బై అన్యువల్ సాంక్షన్ ద్వారా అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గత జులై నెలలో ఈ పథకం అనేది అమలైంది ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్ నెలలో ఈ పథకం అనేది ఇప్పుడు అమలు కాబోతోంది ఎవరైనా అర్హత కలిగి ఉండి పథకాల్లో డబ్బులు రాకపోయి ఉండి ఉంటే వాళ్ళు ఈ భయాన్ని శాంక్షన్ లో మీరు డబ్బులు అయితే పొందుతారు.
Note : ఇప్పుడు చెప్పిన పథకాలలో అమలు అయ్యే తేదీలల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీల ప్రకారమే ఈ ఆర్టికల్ రూపొందించడం జరిగింది. అమలు అయ్యే తేదీలు మార్పులు చేర్పులు పూర్తిగా ప్రభుత్వం వారు చేసే విధి విధానాలకు లోబడి ఉంటుంది.