Skip to content

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. అంపైర్ల కోసం కొత్త కేటగిరీ ఏర్పాటు


BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. అంపైర్ల కోసం కొత్త కేటగిరీ ఏర్పాటు

bcci introduced new category for umpires: అంపైర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంపైరింగ్‌లో సమర్ధత ఆధారంగా నాలుగు కేటగిరీలు ఉండేవి. ఉత్తమ పనితీరు ఆధారంగా ‘ఏ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల ద్వారా అంపైర్లకు స్థానం కల్పించేవారు. అయితే కొత్తగా అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే వాళ్ల కోసం బీసీసీఐ కొత్త కేటగిరీ ఏ+ ఏర్పాటు చేసింది. కొత్త కేటగిరి ఏ+లో 11 మంది అంపైర్లకు స్థానం కల్పించింది. ఈ జాబితాలో అంతర్జాతీయ అంపైర్లు అనిల్ చౌదరి, మదన్‌గోపాల్ జయరామన్‌, వీరేందర్ కుమార్ శర్మ, అనంత పద్మనాభన్, నితిన్ మేనన్‌, నవదీప్ సింగ్ సిద్దూ, నిఖిల్ పట్వర్ధన్, సదాశివ్ అయ్యర్, ఉల్హాస్ గంధే ఉన్నారు.

Read Also: Viral News Of Gst Bills: షాపింగ్ మాళ్లలో ఇలా చేస్తే.. జీఎస్టీ పడదా?

మరోవైపు ‘A’ కేటగిరీలో 20, ‘B’ కేటగిరీలో 60, ‘C’ కేటగిరీలో 46, ‘D’ కేటగిరీలో 11 మంది అంపైర్లు ఉన్నారు. ఫస్ట్‌ క్లాస్ గేమ్‌కు అంపైరింగ్‌ బాధ్యత వహించే ‘A+’, ‘A’ కేటగిరీల్లో ఉన్న అంపైర్లకు బీసీసీఐ రోజుకు రూ. 40వేలు. ఇక ‘B’, ‘C’ విభాగాల్లోని అంపైర్లకు రూ. 30వేల పారితోషికాన్ని బీసీసీఐ చెల్లించనుంది. ఈ మేరకు మాజీ అంతర్జాతీయ అంపైర్లు కే హరిహరన్, సుధీర్ అస్నాని, అమీష్ సాహెబాతో కూడిన సబ్ కమిటీ సిఫారసులను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించింది. అయితే రంజీతో పాటు దేశీయ మ్యాచ్‌లకు విధులు కేటాయింపు కోసమే కొత్త కేటగిరీని ఏర్పాటు చేశామని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే దేశవాళీ క్రికెట్ గాడిన పడుతోందని.. వచ్చే రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ పుంజుకుంటుందని.. అందుకే పూర్తిస్థాయిలో అంపైర్ల ఎంపికను బీసీసీఐ పూర్తి చేసిందని వివరించారు.

.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *